Wednesday, 9 September 2015

రికార్డు సమయములో ఫించనుల పంపిణీని పూర్తి చేసి ఆశ్చర్య పరచిన మండల పరిషత్ సూపరింటెండెంట్ మరియు జూనియర్ అసిస్టెంట్

పోలవరం పంచాయతీలో  రికార్డు సమయములో ఫించనుల పంపిణీని పూర్తి చేసి ఆశ్చర్య పరచిన మండల పరిషత్ సూపరింటెండెంట్ మరియు జూనియర్ అసిస్టెంట్ 
                     సెప్టెంబర్ నెలలో ఫించను బట్వాడా కార్యక్రమాన్నిమండల పరిషత్ కార్యాలయ సూపరింటెండెంట్  వారి సారధ్యములో వీధి వీధిన తిరిగి లేవలేని స్థితిలో ఉన్న వృద్ధులకు,వితంతువులకు మరియు వికలాంగులకు అతి తక్కువ సమయంలో ఫించనులను అందించి పంచాయతీలో ఇదివరుకెన్నడు  చూడని ,అందని రీతిలో ఫించను పంపిణీ చేసియున్నారు .
             పోలవరం పంచాయతీలో ఈ నెల 3వ తేదిన  ఉదయం 7గంటలకు   స్థానిక గణేష్ నగర్ నుండి ప్రారంభించి మొత్తం పది శివారు గ్రామములలో కేవలం ఆరు రోజుల సమయంలో రోజుకు 12 గంటల చొప్పున 1335  ఫించనులకు 1253 ఫించనుల పంపిణీని పూర్తి చేసి అయిదు పదుల వయస్సులో కూడా అలుపెరుగని శ్రమతో కష్టించి ఫించను బట్వాడా లో ఒక కొత్త ఒరవడిని చూపించిన మా మండల పరిషత్ సూపరింటెండెంట్ వార్కి మండల పరిషత్ కార్యాలయం తరుఫున  ధన్యవాదాలు తెలియజేయుచున్నాము.





















No comments:

Post a Comment