ఎంతకాలం ఎంతకాలం .......కాలమాగిపోవాలి ?
క్షేత్ర స్థాయిలో స్పృష్టమైన మార్పు తీసుకురావాలి తప్ప ఎంతకాలం మనకీ కష్టాలు ???????????
పనిచేసే అధికారిని గౌరవించి సత్కరించి , పనిచేయని అసమర్ధులును క్రమశిక్షణా చర్యలతో లైన్లో పెట్టినప్పుడు మీ పెద్దరికం అందరికీ అవసరం అవుతుంది .కాని ప్రస్తుతం కొంతమంది అధికారులు కూడా అనదికారుల అండల తో మొండిగా ముందుకు పోగలుగుతున్నారు.!!
కాని కష్టపడి పనిచేస్తూ ఏ నాయకుల అండ దండలు తీసుకోని వారు చాలామంది లేకపోయినా కొద్దిమంది తమ టాలెంట్ నిరూపించుకొనేందుకు స్వయంగా కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొంటే అలాంటి వారిని కక్ష పూరిత సాదింపు చర్యలతో కేంద్రానికి అందనంత దూరంగా విసిరేస్తున్న ఈ విధాన వ్యవస్థ పై ఎవరికీ గౌరవం గాని భయము గాని ఉండక విరక్తి తో ఉంటారనేది గమనించాలి. కనీసం అధికారులను ట్రాన్సఫర్ చేసే సమయంలో వారికి ఎటువంటి విద్యార్హతలు ఉన్నాయి వారి ట్రాక్ రికార్డు , వారి అందుకున్న అవార్డులు ఏమైనా ఉన్నాయా లేదా అని క్షుణ్ణంగా పరిశీలించకుండా, వారిని పనిచేసే చోట నుండి ట్రాన్సఫర్ చేస్తున్నప్పుడు వారికి కలిగే భాద వారి నీతి, నిజాయతీ నిబద్ధతల మనుగుడపై ఆందోళన కలిగిస్తున్నదా లేదా అన్నది ఉన్నతాధికారులు తమ మనఃసాక్షిని ప్రశ్నించుకోవాలి క్షేత్ర స్థాయి నుండి ఉన్నత స్థాయి అధికారి వరకు వారి ప్రగతి ఆధారంగా వారిలో ఎంతమంది స్థానికంగా నివాసముంటూ ఏ ఒక్కరితో విభేదాలు లేకుండా వారి ఉద్యోగాలను నిర్వర్తిస్తున్నారో గమనించి వివిధ కీలక అంశాలును బెంచ్ మార్క్ గా చేసుకొని కంపేర్ చేసుకొంటే మీరు ఒక నిజమైన స్పృష్టమైన మార్పు ను చూడగలరు .
ఎం పి టి సి లు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు మరియు జన్మభూమి, స్మార్ట్ విలేజ్ కమిటీలు తమ వంతు భాద్యతతో మీకోసం కార్యక్రమములో కీలక పాత్ర పోషించగలిగితే కామన్ మాన్ కష్టాలుకు కాస్ ఏమిటో తెలుస్తుంది
ప్రతి సోమవారం గ్రీవెన్స్ డేను పండుగల బహిరంగ చర్చా వేదికపై జరుపుకునే రోజున కొంతైనా పరిష్కారం దొరుకుతుందని ఆశ


No comments:
Post a Comment