Saturday, 5 December 2015

గుర్రానికి మేతేస్తే ఆవు పాలిస్తుందా - అందని ద్రాక్ష గా ఫించన్ ఫలం

అందని ద్రాక్ష గా  ఫించన్ ఫలం  

వరద భాదితుల సమస్యల లా మారుతున్న ఫించను దారుల అగచాట్లు 
కనీస అవసరమైన ఫించను అందేలా చూడలేకపోతే   మన మేధస్సు మొండికేసినట్లా !? లేకపోతే మేతావుల కోసం పని చేసే మైండ్స్  ఫలితమా ? అవినీతిని అంతం చేసే ఉద్దేశ్యం ఉంటే కఠినమైన  శిక్షలు అమలు చేసి మరోసారి అవకతవకలు జరగకుండా చూడటానికి పారదర్శకత  చూపాలి గాని  గుర్రానికి మేతేస్తే  ఆవు పాలిస్తుందా  అన్నట్లు సాంకేతికను సమస్య గా చూపి మేతావుల కోసం చేసే కసరత్తులు ఇంకెన్నాళ్ళు  ?  అసలు అవినీతికి తొలిమెట్టు గా ఉపయోగ పడే  రేషను కార్డుల జారీలో అడ్డుకట్ట వేసి   అమలులో ఉన్న వాటిని ప్రక్షాళన చేసి  సమష్టి కృషితో వివిధ శాఖల ఉన్నతాధికారుల సమన్వయంతో   ఫించను బట్వాడా కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన  ఇంటిఇంటికి  తిరిగి పంపిణీ చేయాల్సిందే  !!!!

          అంతే కాకుండా ఇకనుంచి అమలు చేసే ఎటువంటి సంక్షేమ పధకాల అమలునైనా సరే  ఒకే సారి ఏక కాలములో తక్కువ  ఖర్చు తక్కువ సమయం ను ప్రధానంగా చేసుకొని  అప్పుడే నియమితులైన   IAS స్థాయి ప్రత్యేక యువ అధికారుల గ్రూపును ఈ విధానానికి ఉపయోగించి  వారి చురుకైన సూచనలతో  క్రొత్త సాంకేతిక పరిజ్ఞానం కూడిన   INTEGRATED DISBURSEMENT  SYSTEMS ను అభివృద్ధి చేయించాలి . అలా అభివృద్ధి చేసిన ఫార్ములా ద్వారా  ముందుగా ఎంపిక చేసిన నిబద్ధతతో పని చేసే  క్రొత్తగా ప్రమోషన్ పొందిన  ఉద్యోగులకు భాధ్యతలు అప్పగించాలి. వీరికి టెక్నికల్ గా  సహాయపడేందుకు   నిరుద్యోగ యువతను కూడా ఎంపిక చేయాలి.
                     ఇప్పుడుకూడా ఏదైనా అవకతవకలు జరిగినట్లైతే   వారి ప్రమోషన్ మరియు జీవిత కాల ప్రభుత్వ ఉద్యోగ అవకాశమును రద్దు చేయాలి. 


                ఇవి అన్నీ కూడా సక్రమంగా సరళలంగా జరిగినట్లైతే   మనకు జరిగిన ప్రయోజనం ఏమిటి అంటే ?????

ఏకకాలంలో  అన్ని పధకాలు ఒకేసారి  ఒక వీధిలో ఉన్న లబ్దిదారులు ఒకేసారి అన్ని ప్రయోజానాలను ఏక కాలంలో ఒకే వేదిక పై అందుకోవచ్చు అంతే కాకుండా ఒకరి ఫించను తీసుకొని , ఇంకొకరు పప్పు దినుసులు గుంజు కోకుండా కూడా  ఫించను .పప్పు మరియు ఏ ఇతర ఫలాల నైనా ఒకే అధికారి నుంచి నేరుగా ఇంటి వద్దే  పొందవచ్చు  

ఇదంతా  కేవలం ఎవరో ఒకరి మెప్పుకోసం వ్రాసింది కాదు ,  మార్పు కోసం 

దయచేసి మీకు నచ్చినట్లయితే  మీరు కూడా ఈ బ్లాగ్ లో మీ స్పందన తెలియజేసి షేర్ చేయండి 

కఠినమైన విధానాల కన్నా కఠినమైన శిక్షల ద్వారా  చాలా వరకు  అవినీతి జరగకుండా మార్పు తీసుకు రావచ్చనేది మా అభిమతం   

REF :


1 comment: